వివేకానంద జయంతి: ఆత్మవిశ్వాసంకి ఒక సందేశం
ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని భారతదేశం జాతీయ యువజన దినోత్సవంగా (National Youth Day) ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజు కేవలం ఒక మహానుభావుడి జన్మదినం మాత్రమే కాదు. ఇది ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆత్మశక్తి యొక్క ఉత్సవం. నేటి యువతకు, ప్రొఫెషనల్స్‌కు స్వామి వివేకానంద సందేశం ఎంతో ప్రేరణాత్మకం. ఈ బ్లాగ్ పోస్ట్‌లో ఆయన బోధనలను ఆధునిక జీవితంతో ముడిపెట్టి చూద్దాం.
వివేకానంద జయంతి ప్రాముఖ్యత
స్వామి వివేకానంద (1863 జనవరి 12 – 1902 జూలై 4) భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడు. భారత ప్రభుత్వం 1984 నుండి ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. నేటి ఫాస్ట్-పేస్డ్ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళనల మధ్య ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ముందుకు సాగలేం. అందుకే ఈ ప్రపంచానికి స్వామీజీ ఇచ్చిన సందేశం ఒక్కటే "నీలోనే అనంత శక్తి దాగి ఉంది – దాన్ని బలంగా నమ్ము! అదే నీకు సరైన మార్గం చూపిస్తుంది"
స్వామి వివేకానందుడు – ఒక సంక్షిప్త పరిచయం
స్వామి వివేకానంద, అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, కలకత్తాలో జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడిగా ఆధ్యాత్మిక జ్ఞానం పొందారు. 1893లో అమెరికాలోని చికాగో విశ్వమత సమ్మేళనంలో ఆయన ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. "సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా" అనే మాటలతో మొదలైన ఆ ప్రసంగం హిందూ ధర్మాన్ని సహనం, సార్వత్రికత యొక్క మతంగా ఈ ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది.ఈ రోజు కూడా ఆయన చెప్పిన మాటలు మనల్ని నిరంతరం ప్రేరేపిస్తాయి. ఎందుకంటే అవి కేవలం మతపరమైనవి కాదు, మానవత్వానికి సంబంధించినవి.
వివేకానంద దృష్టిలో ఆత్మవిశ్వాసం
స్వామీజీ దృష్టిలో ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు! అది మనలోని అంతర్గత శక్తి మీద ఉండే అపారమైన నమ్మకం. ఆయన చెప్పినట్లు:
"సమస్త శక్తీ నీదే. నీవు ఏదైనా సాధించగలవు. దాన్ని నమ్ము, దౌర్బల్యానికి లోనుకాకు."("All power is within you; you can do anything and everything. Believe in that.")
:"లే! మేలుకో! గమ్యం చేరేవరకు విశ్రమించకు"
(Arise, awake, and stop not till the goal is reached.)
ఇది అహంకారం కాదు మనలో దైవత్వం ఉందనే విశ్వాసం. స్వామీజీ ఒక సింహం-గొర్రెల కథ చెప్పి ఇది వివరించారు: సింహం గొర్రెలతో పెరిగి తనను తాను గొర్రె లాగా భావిస్తుంది, కానీ తన ప్రతిబింబం చూసినప్పుడు తన నిజమైన శక్తి తాను తెలుసుకుంటుంది.
నేటి యువతకు వివేకానంద సందేశం
నేటి యువత పరీక్షలు, ఉద్యోగాలు, సోషల్ మీడియా ఒత్తిడి, కెరీర్ అనిశ్చితి వంటి సవాళ్లు ఎదుర్కొంటోంది. భయం, అనుమానం మనల్ని ఆపేస్తాయి. స్వామీజీ సందేశం ఇక్కడ ఎంతో ఉపయోగకరం: మీలోని శక్తిని నమ్మండి, భయాలను జయించండి. ప్రొఫెషనల్స్‌కు కూడా, ఫెయిల్యూర్ భయం లేకుండా ముందుకు సాగండి.
స్వామి వివేకానంద జయంతి కేవలం చరిత్రను గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు – ఆయన సందేశాన్ని రోజువారీ జీవితంలో అమలు చేయడం. ధైర్యంగా నిలబడండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీలోని సింహాన్ని మేలుకొల్పండి!
"లే! మేలుకో! గమ్యం చేరేవరకు విశ్రమించకు"
ఈ వివేకానంద జయంతి మీకు కొత్త శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్!
ఈ వ్యాసం గనక మీకు నకచ్చినట్లైతే ఈ బ్లాగ్‌ను WhatsApp, facebookలలో మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని కథనాల కోసం మా Whats app Channel ను follow అవ్వండి. మరో మంచి వ్యాసంతో మళ్ళీ కలుద్దాం!
Join in our Whats app Channel click here : Join Now