11/01/2025 - 263
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలా ముఖ్యమయిన పాత్ర నిర్వహిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అదికూడా శకుంతలకథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది: ప్రస్తుతకథ ఆదిపర్వంలోనిది.
READ MORE
07/01/2025 - 288
రాయబారానికి వెళ్ళాడు సంజయుడు. శుష్కప్రియాలతో వెళ్ళి, శూన్యహస్తాలతో తిరిగివచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్ర మహారాజును దర్శించి, రాయబారం విఫలమయిందని, విశేషాలన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు, గురు, వృద్ధబాంధవమంత్రి, సామంత, దండనాథులందరూ ఉండగా వివరంగా చెపుతానని స్వగృహానికి వెళ్ళాడు.
READ MORE
07/01/2025 - 303
మహా విద్వాంసుడూ, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రీ అయిన విదురుడు తన ప్రభువు అవివేకాన్ని వేలెత్తి చూపుతూ చెబుతున్నాడు. ప్రభూ ! ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. పదిమందికీ పెట్టి, పేద వారికి దాన ధర్మాలు చేస్తూండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసుగుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్నవాడు కూడా ఆనందిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం.
READ MORE
03/01/2025 - 294
పాండవులు జూదంలో ఓడిపోయి, అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిదులు కూడా అనుసరించి రాగా, వీరందరి పోషణ భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు. అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు:'ధర్మనందనా! రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీనులు అందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణననందించారు.
READ MORE
03/01/2025 - 298
భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా ! అని ఆశ్చర్య పడేవారు లక్షకు పైగా ఉంటారు. కాని లక్ష శ్లోకాల మహాభారతంలో సత్యభామ ఉండేది అయిదారు నిముషాలు. ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది, అది మీరే చూడండి.
READ MORE
29/12/2024 - 384
ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడు తనతల్లి వినతకు దాసీత్వం తప్పించడానికి నాగులకోరికమీద 'అమృత కలశం' తేవడానికి బయదేరుతాడు. దారిలో తన ఆకలితీరేదారి చెప్పమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెపుతున్నాడు.
READ MORE
29/12/2024 - 288
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శనభాగ్యం లభించింది. ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంత సేపు విచారించి, యింతకంటె దుఃఖాల పాలయిన శ్రీరామచంద్రుల కథ, నలదమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు. అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలూ, మహర్షుల విశేషాలూ చెపుతున్నాడు.
READ MORE
26/12/2024 - 379
చాలా రోజులక్రితం మాట. అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణికోటినీ దయాహృదయంతో చూసే వాడు. ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూండగా వాని పితృ పితామహులు కనిపించి: 'నాయనా, యోగ్యురాలయిన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు • అన్నారు.
READ MORE18/12/2024 - 670
“మహామునులారా! జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు" అని సూతుడు కథ మొదలు పెట్టాడు. “జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. క్రింద పెద్దగొయ్యి. దాని ప్రక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు. దానిమీద తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసే ఋషులు.
READ MORE
15/12/2024 - 257
(ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.) ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకి మిగిలారు.
READ MORE
08/12/2024 - 291
అహంకారం ఎప్పుడు వినాశానికి దారి తీస్తుందనే మహాశక్తిమంతుడైన దంభోద్భవుడు కథ ద్వారా పరశురాముడు చేసిన హితబోధ. శ్రీకృష్ణుని రాయబారంలో చెప్పిన అద్భుత సందేశాన్ని చదవండి.
READ MORE
06/12/2024 - 275
పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణస్నేహితుడు రైభ్యుడు. వారిరువురూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి, నదీస్నానం చేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యువక్రీతుడనే కుమారుడు కలిగాడు.
READ MORE
01/12/2024 - 310
ఆయనకు గుణకేశి అని ఒక కూతురు, గుణకేశి ఎంతో అందగత్తె అంతకంటే గుణవతి, శీలసంవన్న, విద్యావతి, తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదయాన్ని, ఆచార వ్యవహారాలనూ చక్కగా అలవరచుకొని పదిమందిలో వినయగుణవతిగా పేరు పొందింది. బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగు పెట్టింది.
READ MORE
20/11/2024 - 416
విఘ్నాలను తొలగించే దేవుడు, పూజల్లో అందరికంటే ముందుగా ఆహ్వానింపబడే ఆది దేవుడు, ముల్లోకాలను చుట్టేసిన వినాయకుడు! వినాయకుడు ఎలా జన్మించాడు? బొజ్జ గణపయ్య పుట్టుక ఏ ప్రాంతంలో జరిగింది? గణపతి పుట్టుక వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
READ MORE